రజినీ 50 ఏళ్ల ప్రస్థానం.. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

రజినీ 50 ఏళ్ల ప్రస్థానం.. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించిన సూపర్ స్టార్ గా ఎదిగారాయన. భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. తన నటనా కౌశలంతో మాస్, క్లాస్ అభిమానులను కట్టి పడేసిన లెజెండ్ రజినీ కాంత్. ఒకవైపు యాక్షన్ హీరోగా, మరోవైపు హాస్యంతో, సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు సరిహద్దులు లేవు. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ తన ప్రత్యే కతను చాటుకున్నాడు. ఆయన సినీ ప్రస్థానంలో 50 ఏళ్లుపూర్తి చేసుకున్నారు. నటనలోని వైవిధ్యం, కష్టపడి సాధించిన స్థానమే ఆయనను లెజెండ్ గా నిలిపాయి. ఇక ఈ అరుదైన విజయోత్సవ సందర్భంలో రజనీకాంత్ కు  సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

►ALSO READ | THE BENGAL FILES Trailer: మరో మిస్టరీయస్ స్టోరీతో వివేక్‌ అగ్నిహోత్రి.. ఉత్కంఠరేపుతోన్న ట్రైలర్‌..

ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఎక్స్ ద్యారా శుభకాక్షలు తెలిపారు... "సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారికి సినీ పరిశ్రమలో 50 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. మీ అభినయం, స్టైల్, విభిన్న పాత్రలతో తరతరాల ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సినీ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం. ఇకపై కూడా ఆరోగ్యం, ఆనందం కలిగి దీర్ఘాయుష్షుతో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం' అని రాసుకొచ్చారు ప్రధాని,