
న్యూఢిల్లీ : హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల కోసం ఉపయోగించే వెరిసిగ్వాట్‌ను మార్కెట్ చేయడానికి పంపిణీ చేయడానికి భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీ లాబొరేటరీస్ లిమిటెడ్, బేయర్ శుక్రవారం ప్రకటించాయి. ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం, బేయర్ గంత్రా బ్రాండ్ పేరుతో డాక్టర్ రెడ్డీస్‌కు నాన్ -ఎక్స్‌క్లూజివ్ హక్కులను మంజూరు చేసింది. కరిగే గ్వానైలేట్ సైక్లేస్ స్టిమ్యులేటర్ వెరిసిగ్వాట్‌ను గుండె వ్యాధుల బాధితులకు వాడుతారు. మనదేశంలో దాదాపు కోటి మంది వరకు గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు.