బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి..మంత్రి పొన్నంకు బీసీ సంఘాల వినతి

బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి..మంత్రి పొన్నంకు బీసీ సంఘాల వినతి

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, బీసీ సంఘాల నేతలతో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసేందుకు తేదీ ఖరారు చేయాలన్నారు. 

గురువారం బీసీ రిజర్వేషన్ల అంశంపై మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గణేష్ చారి, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యామ్​కురుమతోపాటు పలువురు నేతలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిన బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జీవో తీసుకురావాలని ఆలోచిస్తున్నదనీ, భవిష్యత్తులో న్యాయపరంగా ఈ జీవో నిలబడదనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని మంత్రి దృష్టికి తెచ్చారు.