
ముషీరాబాద్, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
బుధవారం విద్యానగర్ బీసీ భవన్ లో సి.రాజేందర్, రాజ్ కుమార్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలని కోరారు.