
ఖాట్మండు: జెన్ జెడ్ నిరసనల్లో మరణించిన వారికి నివాళిగా నేపాల్ ప్రభుత్వం బుధవారం జాతీయ సంతాప దినాన్ని పాటించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేశారు. విదేశాల్లోని అన్ని నేపాల్ రాయబార కార్యాలయాలను కూడా బంద్ చేశారు.
జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగురవేశారు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం అక్కడి ప్రభుత్వం ‘జెన్- జెడ్ మెమోరియల్ పార్క్’ ను నిర్మించనుందని రైజింగ్ నేపాల్ డైలీ వెల్లడించింది. అంతకు ముందు నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీ మాట్లాడుతూ.. జెన్ జెడ్ నిరసనల్లో మరణించిన వారిని అమరులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.