
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి కి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగపై పాట లు రాసి, వీడియోలు రూపొందించాలని కళాకారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, సాంస్కృతిక సలహా మండలి సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేసేలా కళా ప్రదర్శనలు ఇవ్వాలని, రచనలు చేయాలని కోరారు. పం డుగ విశిష్టతను వివరిస్తూ పాటలు రాయా లని, ప్రత్యేక వీడియోలు రూపొందించాలని సూచించారు. ఇవి పండుగపై ప్రజల్లో అవగా హన పెంచి.. స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి, ప్రముఖ దర్శకులు నర్సింగరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు.