మోదీ తల్లిపై రూపొందించిన ఆ వీడియోను తీసేయండి:పాట్నా హైకోర్టు ఆదేశం

మోదీ తల్లిపై రూపొందించిన ఆ వీడియోను తీసేయండి:పాట్నా హైకోర్టు ఆదేశం
  • కాంగ్రెస్​కు పాట్నా హైకోర్టు ఆదేశం 

పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌‌‌‌ పై రూపొందించిన ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్ పార్టీని పాట్నా హైకోర్టు ఆదేశించింది. ప్రధాని మోదీకి ఆయన తల్లి హీరాబెన్‌‌‌‌ కలలోకి వచ్చినట్టు బిహార్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ ఏఐ వీడియోను రూపొందించి ‘ఎక్స్‌‌‌‌’ లో పోస్టు చేసింది. 

ఈ వీడియో ప్రధాని మోదీని అవమానించే విధంగా ఉందని అడ్వకేట్ వివేకానంద్ సింగ్, ఇతరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రాజకీయ పార్టీలకు విధించిన నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఈ వీడియో ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం పాట్నా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీబీ. బజంత్రి విచారణ జరిపారు. 

తుదుపరి విచారణ తేదీ వరకు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్​ల నుంచి ఆ వీడియోను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.