V6 News

బీసీ కుల గణన చేపట్టాలె.. ఓబీసీ మహాసభలో నేతల డిమాండ్

బీసీ కుల గణన చేపట్టాలె..  ఓబీసీ మహాసభలో నేతల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టబోయే జనగణనలో బీసీ కుల గణన అంశాన్ని కూడా చేర్చాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఏపీలోని తిరుపతిలో అఖిల భారత 8వ జాతీయ ఓబీసీ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి 29 రాష్ట్రాల బీసీ సంఘాల నేతలు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్‌‌‌‌ హన్సరాజ్‌‌‌‌ గంగారాం అయిర్‌‌‌‌‌‌‌‌, మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ తదితరులు హాజరయ్యారు. బీసీల సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, ఆయన బీసీలకు న్యాయం చేస్తారని గంగారం అన్నారు. బీసీ కుల గణన తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకు రావాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బీసీలు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.