
- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించటానికి, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తన జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. శనివారం బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
గాంధేయవాదిగా విలువలకు కట్టుబడి, ఎన్నో పోరాటాలు చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవిత చరిత్ర నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. తెలంగాణ తొలి, మలి దశ పోరాటంలో వారితో పాటు క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం తనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని నిరంజన్ చెప్పారు.