జీవో 46ను వెనక్కి తీసుకోవాలి : చైర్మన్ నిరంజన్

జీవో 46ను వెనక్కి తీసుకోవాలి :  చైర్మన్ నిరంజన్
  • బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచన

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 46లో అవాస్తవాలు ఉన్నాయని, ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. రిజర్వేషన్లను సవరించాలని, బీసీలకు న్యాయం చేయాలని ఆదివారం పత్రిక ప్రకటనలో కోరారు. 

బీసీ డెడికేటేడ్ కమిషన్ కేవలం బీసీ వెనుకబాటు తనాన్ని పరిశీలించి రిజర్వేషన్లను ఖరారు చేయటానికి ప్రభుత్వం నియమించిందని, అంతే తప్ప ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను పరిశీలించే అధికారం కమిషన్ కు లేదని ఆయన అన్నారు.“ జీవోలో డెడికేటెడ్ కమిషన్ ఎస్టీ, ఎస్సీ, బీసీ మూడింటికీ సిఫారసులు చేసినట్టు తప్పుగా చూపారు. ఇది కమిషన్ అధికారాలను అతిక్రమించినట్టు కాదా? లేదా ఈ తప్పుడు సమాచారాన్ని ఎవరు జొప్పించారు? దీనికి బాధ్యులు ఎవరు ” అని నిరంజన్ ప్రశ్నించారు.