హైదరాబాద్, వెలుగు: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సీడ్ స్కీమ్ లో లబ్ధి పొందేందుకు సంచార జాతులను నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని బీసీ కమిషన్ కోరింది. ఈ అంశంపై బీసీ జాబితాలో ఉన్న 50 సంచార జాతుల వివరాలతో త్వరలో ప్రభుత్వానికి లేఖ రాయనుంది. బుధవారం ఖైరతాబాద్ లో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన బీసీ కమిషన్ సమావేశం జరిగింది.
సీడ్ స్కీమ్ లో లబ్ధి పొందేందుకు సంచార జాతులకు డీఎన్టీ (డీ నోటిఫైడ్ ట్రైబల్) సర్టిఫికెట్లు తహాశీల్దార్ నుంచి కాకుండా ఆర్డీవో ద్వారా జారీ చేయాలని ప్రభుత్వానికి చైర్మన్ నిరంజన్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ మినహా మిగతా అన్ని శాఖల నుంచి కమిషన్‌కు సమాచారం అందిందని పేర్కొన్నారు.
