ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో బీసీలకు నష్టం : చంద్రశేఖర్గౌడ్

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో బీసీలకు నష్టం : చంద్రశేఖర్గౌడ్

నిజామాబాద్​, వెలుగు: అగ్రవర్ణాలకు కల్పించిన పది శాతం ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్​ రద్దు చేసి బీసీలకు కలుపాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్​గౌడ్ డిమాండ్​ చేశారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్​లు లేక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.

 స్టేట్​ గవర్నమెంట్ ఆర్డినెన్స్​ను అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు.  నాన్​ గెజిటెడ్ ఆఫీసర్స్​ స్టేట్ అసోసియేట్​ ప్రెసిడెంట్ హెచ్​.రేవంత్​, బీసీ ఉగ్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరిపె రవీందర్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్​ జిల్లా ప్రెసిడెంట్ కె. నాగరాజు, ఇరిగేషన్ శాఖ క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ పోల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.