
ముషీరాబాద్, వెలుగు: బీసీ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని బీసీ కుల సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం దోమలగూడలోని బీసీ కేంద్ర కార్యాలయంలో వివిధ బీసీ సంఘాల సమావేశం జరిగింది.
మీడియాతో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి మాట్లాడుతూ.. బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తృతంగా నిర్మాణం చేసి బీసీ సమస్యలపై 20 ఏండ్లుగా అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇస్తే బీసీలంతా ఐక్యమై గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో మాదేశీ రాజేందర్, ఆనంద లక్ష్మి, సాయినాథ్ సాగర్, ఓంసాయి పాల్గొన్నారు.