పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి : ఆర్. కృష్ణయ్య

పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి : ఆర్. కృష్ణయ్య
  • ఈనెల 29,30న ఛలో ఢిల్లీ

బషీర్ బాగ్,వెలుగు :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.  బీసీ బిల్లు, కులగణన డిమాండ్లతో  ఈనెల 29, 30 తేదీల్లో చలో ఢిల్లీ చేపట్టి పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి బీసీ నేతలు భారీగా పాల్గొంటారని పేర్కొన్నారు. 

శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బీసీ సంఘాలు నిర్వహించిన  సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఇందులో ఆర్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ.. బీసీ బిల్లు పెట్టాలని30 ఏళ్లుగా పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు చేశామని, 66 సార్లు ప్రధాన మంత్రులను కలిసి చర్చలు చేసినట్టు గుర్తు చేశారు. నేడు దేశానికి ప్రధాని బీసీ ఉన్నా బీసీలకు ఒరిగింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.