బీసీలపై రెడ్డి జాగృతి కుట్ర

బీసీలపై రెడ్డి జాగృతి కుట్ర

షాద్ నగర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పిస్తూ జీవో నంబర్ 9ను ప్రభుత్వం తీసుకొస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ హైకోర్టులో పిటిషన్  వేయడం తగాదని బీసీ  జేఏసీ నేతలు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకొని రెడ్డి జాగృ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూసీ కోట పది శాతం పెంచినప్పుడు బీసీలు వ్యతిరేకించలేదని, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ లు కల్పిస్తే అడ్డుకోవడంలో ఆంతర్యం ఏంటో తెలపాలన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ బహుజన నేతలు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్ అర్జునప్ప, నర్సింలు గౌడ్, కరుణాకర్, చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు.