V6 News

ఓబీసీ రిజర్వేషన్లపై  ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వండి : బీసీ నేతలు

 ఓబీసీ రిజర్వేషన్లపై  ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వండి : బీసీ నేతలు
  • ఎంపీ వంశీకృష్ణకు వినతి పత్రం ఇచ్చిన బీసీ నేతలు

పెద్దపల్లి, వెలుగు: ఓబీసీ  రిజర్వేషన్ల సాధనలో భాగంగా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు. శుక్రవారం  ఢిల్లీలో కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ, మనోజ్ గౌడ్,  కోమటిపల్లి రాజేందర్, నర్సింగోజు శ్రీనివాస్  తదితరులు ఉన్నారు.