ఆర్డినెన్స్కు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడండి..సీఎం రేవంత్కు బీసీ సంఘాల విజ్ఞప్తి

ఆర్డినెన్స్కు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడండి..సీఎం రేవంత్కు బీసీ సంఘాల విజ్ఞప్తి
  • 42 శాతం రిజర్వేషన్లపై కృతజ్ఞతలు తెలిపిన నేతలు

హైదరాబాద్/బషీర్​బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై  సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణ య్య నేతృత్వంలో 30 బీసీ సంఘాల నేతలు సీఎంను జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో కలిసి  ధన్యవాదా లు తెలిపారు.

 ఈ సందర్భంగా రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంతో చర్చించారు. అనంతరం బీసీ సంఘాల నేతలతో కలిసి ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశంపై ఎవరూ కోర్టులకు పోకుండా ప్రభుత్వం ముందు జాగ్ర త్తగా సుప్రీంకోర్టు, హైకోర్టులో కేవియెట్ ​వేయాలని  విజ్ఞ ప్తి చేశారు.

 దీంతో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉందన్నారు. సీఎంను కలిసిన వారిలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ  తదితరులు ఉన్నారు. అంతకుముందు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలోకృష్ణయ్య మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవడం బీసీల పోరాట విజయమని చెప్పారు. స్థానిక సంస్థలలో బీసీలకు వాటా ఇస్తుంటే అగ్రకులాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు.