హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ తిప్పలు తప్పేదెలా?..

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ తిప్పలు తప్పేదెలా?..
  • ఇయ్యాల్టి నుంచి సిటీలో ట్రాఫిక్​ సమ్మిట్​
  • పర్సనల్​ వెహికల్స్​వాడంకపై ఆసక్తి 
  • ఆరేండ్లలో 40 శాతం పెరిగిన వాహనాలు 
  • తగ్గిన పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​వినియోగం
  • రూల్స్​ బ్రేక్​ చేయడమూ ట్రాఫిక్ సమస్యకు కారణమే

హైదరాబాద్ సిటీ, వెలుగు: వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్​ఒకటి.. కానీ, తీవ్రమైన ట్రాఫిక్ సమస్య సిటీని పట్టి పీడిస్తున్నది. ఈ ఏడాది సిటీలో వాహనాల సంఖ్య 90 లక్షలకు చేరుకోవడంతో దేశంలోనే అత్యధిక వాహన డెన్సిటీ కలిగిన నగరంగా నిలిచింది. దీంతో సిటీలో ట్రాఫిక్​ సమస్యను తగ్గించేందుకు ట్రాఫిక్​ పోలీసులు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. వాహనదారులు, ఎన్జీవోల భాగస్వామ్యంతో చర్యలు తీసుకుంటున్నా అనుకున్నంత ఫలితాలు రావడం లేదు. 

ఈ నేపథ్యంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్​సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ఆధ్వర్యంలో తొలిసారిగా ట్రాఫిక్​ సమ్మిట్​నిర్వహిస్తున్నారు. దీన్ని గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ ప్రారంభించనున్నారు. ఇందులో సీపీ సీవీ ఆనంద్, లా అండ్​ఆర్డర్​అడిషనల్​సీపీ విక్రంసింగ్​మాన్, ట్రాఫిక్​జాయింట్​సీపీ జోయల్​డేవిస్ తదితరులు పాల్గొని  నగరంలో ట్రాఫిక్​సమస్య నివారణకు ఏం చేయాలో చర్చించనున్నారు.

  
రోజు 2 వేల కొత్త వాహనాలు 

గత ఆరేండ్లలో నగర రోడ్లపై వాహనాల సంఖ్య 40 శాతం పెరిగింది. 2019లో కిలోమీటరుకు 6,500 వాహనాలుండగా, ఈ ఏడాది నాటికి 9,500 నుంచి 10 వేలకు చేరువైంది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల టూ-వీలర్లు , 16 లక్షల కార్లు  రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్​కు దాదాపు 8వేల టూవీలర్లు, 2వేల కార్లు రోడ్ల మీద కనిపిస్తున్నట్టు ఓ అంచనా.

పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ పై నో ఇంట్రస్ట్​ 

సిటీలో ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్​వంటి పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సౌకర్యాలున్నా వీటి వినియోగం తక్కువగానే ఉంది. 2011లో ఎంఎంటీఎస్​లో రోజుకు 3.5 లక్షల ట్రిప్పులు నమోదు కాగా, 2024 నాటికి ఇది 30 వేలకు పడిపోయింది. వీరంతా మెట్రో, ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్​వెహికల్స్​వైపు మళ్లారు. ప్రైవేట్ కార్ల ద్వారా రోజువారీ ట్రిప్స్ 4 లక్షల నుంచి నాలుగు రెట్లు పెరగడమే దీనికి ఉదాహరణ. దీంతోపాటు సిటీలో వర్షాకాలంలో రోడ్లపై వరద ఆగుతుండడంతో  తీవ్రమైన ట్రాఫిక్​సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్య ఎక్కువగా ఐటీ కారిడార్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట, అమీర్​పేట, కూకట్​పల్లి ప్రాంతాల్లో  ఎక్కువగా కనిపిస్తోంది.  

ట్రాఫిక్ రూల్స్​ బ్రేక్​..

ఫైన్లు, వాహన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా చాలామంది వాహనదారులు ట్రాఫిక్​ రూల్స్ బ్రేక్​ చేస్తున్నారు. ముఖ్యంగా రాంగ్-సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, రాంగ్​పార్కింగ్ వంటి సమస్యలు ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌లను తీవ్రతరం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఫ్రీలెఫ్ట్​లను బ్లాక్​ చేయడం సాధారణంగా మారడంతో సులభంగా వెళ్లాల్సిన వాహనాలు కూడా రోడ్లపై నిలిచిపోతున్నాయి. కొన్ని హోటళ్లు, షాపింగ్​ మాల్స్​ముందు కస్టమర్ల వాహన పార్కింగ్​లు రోడ్లపై వెళ్లే వాహనాలకు ఇబ్బందిగా మారుతున్నాయి. 

లేట్​ జర్నీ  

నగరంలో సగటు వాహన వేగం 2024లో గంటకు 17–18 కిమీ ఉండేది. ఇప్పుడది 24–25 కిలోమీటర్లకు పెరిగింది. అయినా, ఇప్పటికీ ఇది సాధారణ వేగం కంటే తక్కువే. పీక్ అవర్స్‌‌‌‌‌‌‌‌లో, పంజాగుట్ట, బేగంపేట, మియాపూర్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్​అవుతూ గంటకు కిలోమీటర్ వేగాన్ని ఇంకా తగ్గిస్తోంది.  

పోలీసులు తీసుకుంటున్న చర్యలు..

సిటీలో ట్రాఫిక్​ ఒత్తిడిని తగ్గించేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. అయితే, ట్రాఫిక్​వింగ్​లో సిబ్బంది కొరత వారిని వేధిస్తున్నది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఇటీవల హైదరాబాద్​సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ఆధ్వర్యంలో ట్రాఫిక్​మార్షల్స్​ను నియమించారు. వీరు ట్రాఫిక్ వలంటీర్లు, పోలీసులు కలిసి  ట్రాఫిక్​సమస్య పరిష్కారానికి పని చేస్తున్నారు. అలాగే ఆపరేషన్​రోప్​ పేరుతో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు యత్నిస్తున్నారు. కెమెరాలు, గూగుల్ సహాయంతో ట్రాఫిక్ ను మానిటర్​చేస్తూ ఎప్పటికప్పుడు వాహనదారులను సోషల్​ మీడియా ద్వారా అలర్ట్​చేస్తున్నారు.   

ఇలా చేస్తే.. ట్రాఫిక్ సమస్యకు చెక్

ట్రాఫిక్​సమస్య పరిష్కార బాధ్యత కేవలం పోలీసులదే అనుకోకుండా నగరవాసులు కూడా తమ వంతు సహకారం అందించాలి. ట్రాఫిక్​ సిగ్నల్స్​ ఫాలో కావడం, నో పార్కింగ్​ప్లేసుల్లో పార్కింగ్​ చేయకపోవడం, రాంగ్​రూట్​లో డ్రైవ్​ చేయకపోవడం వంటివి ట్రాఫిక్​జామ్స్​ను తగ్గిస్తాయి. 

వీలైనంత ఎక్కువగా పబ్లిక్​ ట్రాన్స్​పొర్టేషన్​ను వాడుతూ ప్రైవేట్ వాహనాలను తగ్గించడం  
 ఒక్కరే ఆఫీసులకు వెళ్తున్నట్టయితే కార్లకు బదులు బైక్​వాడడం.. లేదా పబ్లిక్ ​ట్రాన్స్​పొర్టేషన్ ​వినియోగించడం
లింక్ రోడ్లు, స్లిప్​ రోడ్లను డెవలప్​ చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. 
స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ లో భాగంగా వీలైనంత ఎక్కువగా ఆటోమేటెడ్ సిగ్నల్స్, డ్రోన్ కెమెరాలు వినియోగించడం, రియల్-టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉపయోగించి ట్రాఫిక్ ఫ్లోను కంట్రోల్​ చేయడం.. 
ఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, రోడ్  సేఫ్టీ  గురించి వివరించి పాటించేలా చేయాలి