ఊరంతా కదిలారు.. కోతులను అడవికి తరిమారు.. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుక్రియేట్

ఊరంతా కదిలారు.. కోతులను అడవికి  తరిమారు.. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుక్రియేట్
  • వాట్సాప్ గ్రూపు ఏర్పాటు  చేసుకుని నిర్ణయం 
  • ఒకే రోజు 500 కోతులను అడవిబాట పట్టించిన జగిత్యాల జిల్లా పూడూరు గ్రామస్తులు   

కొడిమ్యాల,వెలుగు: కోతుల బెడదతో విసిగిపోయిన గ్రామస్తులు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అడవిలోకి తరిమివేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో కోతుల బెడద తీవ్రంగా ఉంది. రోజూ  ఉదయం లేవగానే కోతులతోనే గ్రామస్తులు కుస్తీ పడుతుంటారు.

 దీంతో కొందరు యువకులు సంఘటితంగా ఒక నిర్ణయానికి వచ్చారు. వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేశారు. ఇంటికొకరుగా సుమారు100 మంది యువకులు మంగళవారం కర్రలతో బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతూ కోతులను తరుముతూ అడవిబాట పట్టించారు.

 సుమారు 500 వరకు కోతులను వెళ్లగొట్టినట్టు, మరో రెండు రోజుల్లో మిగతావాటిని కూడా తరిమివేస్తామని తెలిపారు. పూడూరు గ్రామస్తులను ఆదర్శంగా తీసుకుని సమీప గ్రామాల ప్రజలు కూడా కోతులను తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారు