సెప్టెంబర్ 19న బీసీల రాజకీయ మేధోమదన సదస్సు : జాజుల శ్రీనివాస్ గౌడ్

సెప్టెంబర్  19న బీసీల రాజకీయ మేధోమదన సదస్సు  : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ నేత జాజుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించడానికి ఈ నెల19న వరంగల్​లో బీసీల రాజకీయ మేధోమదన సదస్సును నిర్వహించనున్నట్టు బీసీ నేత  జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా జరుగుతున్న కుట్రలను ఎండగట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో మరొక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ సదస్సు నిర్వహించనున్నట్టు మంగళవారం  పత్రిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ మేధోమదన సదస్సులో బీసీ మేధావులు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాల నేతలు పాల్గొంటారని వెల్లడించారు.