ఖమ్మం అర్బన్ మండలంలో ఇండ్లను కూల్చిన ఆఫీసర్లను శిక్షించాలి

ఖమ్మం అర్బన్ మండలంలో ఇండ్లను కూల్చిన ఆఫీసర్లను శిక్షించాలి

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న పక్కా ఇండ్లను అకారణంగా కూల్చిన ప్రభుత్వ అధికారులను, ఆదేశాలు ఇచ్చిన మంత్రులను కఠినంగా శిక్షించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భూదాన బాధితుల నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరాల ఉద్యమ మహా ర్యాలీ నిర్వహించారు. 

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ మాట్లాడుతూ తక్షణమే వెలుగుమట్లలో 100 గజాల్లో అర్హులైన బాధితులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో కన్వీనర్ వట్టే ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.