IND vs AUS: కుర్రాళ్లకు కెప్టెన్‌గా శ్రేయాస్.. ఆస్ట్రేలియా 'ఎ' సిరీస్‌కు భారత 'ఎ' జట్టు ప్రకటన

IND vs AUS: కుర్రాళ్లకు కెప్టెన్‌గా శ్రేయాస్.. ఆస్ట్రేలియా 'ఎ' సిరీస్‌కు భారత 'ఎ' జట్టు ప్రకటన

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ భారత టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అర్ధమవుతోంది. టీమిండియా చివరిసారిగా ఇంగ్లాండ్ తో ఆడిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు శ్రేయాస్ అయ్యర్ స్క్వాడ్ లో స్థానం లభించలేదు. అయితే సెలక్టర్లు మాత్రం ఇండియా-ఏ జట్టుకు శ్రేయాస్ అయ్యాను కెప్టెన్ చేసి టెస్ట్ క్రికెట్ లోకి రానున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియా- ఏ జట్టుతో భారత-ఏ జట్టు రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లకు 15 మందితో కూడిన భారత జట్టును శనివారం (సెప్టెంబర్ 6) బీసీసీఐ ప్రకటించింది. 

శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్సీ అవకాశం దక్కింది. 30 ఏళ్ళ అయ్యర్ 2024 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో చివరిసారిగా ఆడాడు.    ధృవ్ జురెల్ కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్ లో మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డి స్క్వాడ్ లో ఉన్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రెండు మ్యాచ్ లు జరుగుతాయి. భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్లు కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉంటారు. అక్టోబర్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ కు ఉపయోగపడనుంది. 

►ALSO READ | Asia Cup 2025: ఓపెనింగ్ లేదు.. వికెట్ కీపింగ్ కూడా ఔట్: తుది జట్టులో సంజు శాంసన్‌కు నో ఛాన్స్

ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ కు జట్టులో స్థానం దక్కింది. ఇండియా ఎ జట్టులోకి కొత్తగా హర్ష్ దుబే, ఢిల్లీ బ్యాటర్ ఆయుష్ బడోని, ఫాస్ట్ బౌలర్లు యష్ ఠాకూర్, గుర్నూర్ బ్రార్ ఉన్నారు. సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు తొలి టెస్ట్.. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు రెండో మ్యాచ్ జరుగుతుంది. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, రుతురాజ్ గైక్వాడ్ లకు జట్టులో స్థానం దక్కలేదు. 

ఆస్ట్రేలియాతో ఏ సిరీస్ కు భారత ఏ జట్టు: 

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ ( వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ ( వైస్ కెప్టెన్, వికెట్ కీపర్)   దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్