ఐపీఎల్‌కు ‘పెద్దోడు’ దూరం

ఐపీఎల్‌కు ‘పెద్దోడు’ దూరం

లీగ్​లో ఆడకుండా తాంబేపై అనర్హత వేటు

న్యూఢిల్లీ: కోల్‌‌కతా లెగ్‌‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే ఆశలకు బీసీసీఐ చెక్‌‌ పెట్టింది. బోర్డు రూల్స్‌‌ను ఉల్లంఘించినందుకు ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌లో ఆడకుండా అనర్హత వేటు వేసింది. దీంతో 48 ఏళ్ల వయసులో ఐపీఎల్‌‌ ఆడిన రికార్డును సొంతం చేసుకోవాలని భావించిన
తాంబేకు ఊహించని షాక్‌‌ తగిలింది. బీసీసీఐ అనుమతి లేకుండా గతేడాది యూఏఈలో జరిగిన టీ10 లీగ్‌‌లో సింధీస్‌ టీమ్‌‌ తరఫున
తాంబే నాలుగు మ్యాచ్‌‌లు ఆడాడు. ‘తాంబే మొదట రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దానిని పక్కనబెట్టి మళ్లీ ముంబై లీగ్‌‌లో ఆడాడు. ఎవరికీ చెప్పకుండా ఆ వెంటనే దుబాయ్‌‌లో టీ10 లీగ్‌‌లో పాల్గొన్నాడు. రూల్స్‌‌ను అతను అతిక్రమించాడు కాబట్టి ఐపీఎల్‌‌ నుంచి డిస్‌ క్వాలిఫై చేస్తున్నాం ’ అని ఐపీఎల్‌‌ చైర్మన్‌‌ బ్రిజేశ్‌ పటేల్‌‌ వెల్లడించారు. ఈ విషయాన్ని కోల్‌‌కతా నైట్‌ రైడర్స్‌‌కు తెలియజేశామని చెప్పిన పటేల్‌‌.. రీప్లేస్‌ మెంట్‌ కోసం ఫ్రాంచైజీకి చాన్స్‌‌ ఇస్తామన్నాడు. అతిపెద్ద వయస్కుడిగా గతేడాది డిసెంబర్‌‌లో జరిగిన వేలంలో వచ్చిన తాంబేను కోల్‌‌కతా రూ. 20 లక్షల బేస్‌ ప్రైస్‌‌కు తీసుకుంది.

For More News..

సీనియర్లకు కాదు.. సత్తా ఉన్నవారికే పీసీసీ పదవి

చదవలేక.. పారిపోతున్నరు.. ప్రాణాలు తీసుకుంటున్నరు

మహిళలకోసం మహిళా వైన్ షాపులు