BCCI vs Suryakumar: టీమిండియాను మూడోసారి చారిత్రాత్మక టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కేవలం మూడు నెలలకే సూర్యకుమార్ యాదవ్ (Surya)కి బీసీసీఐ సెలక్టర్లు గట్టి షాక్ ఇచ్చారు. సూర్యను కెప్టెన్సీ నుంచి పీకేయడమే కాకుండా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల జట్లలోనూ చోటు ఇవ్వకుండా ఏకంగా టీ20ల నుంచే టోటల్‌గా పక్కనబెట్టేశారు.
క్లారిటీ ఇచ్చిన అజిత్ అగార్కర్..
సూర్యకుమార్ యాదవ్ ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టుకి కొత్త కెప్టెన్ గా అధికారికంగా అనౌన్స్ చేశారు. సూర్యపై ఊహించని వేటుపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌తో ఇలాంటి డిస్కషన్ చేయడం అస్సలు ఈజీ కాదని, కానీ రాబోయే రెండేళ్ల వరల్డ్ కప్ సైకిల్‌ను దృష్టిలో పెట్టుకుని, టీమ్ ప్రయోజనాల కోసమే సూర్యతో పర్సనల్‌గా మాట్లాడి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చిండు.
కెప్టెన్సీ వచ్చాక సీన్ రివర్స్..
సూర్యకుమార్ యాదవ్ పై ఈ రేంజ్లో యాక్షన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆయన బ్యాటింగ్ గ్రాఫ్ ఘోరంగా పడిపోవడమే.. కెప్టెన్సీ రాకముందు 43.60 సగటుతో 4 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో దుమ్ములేపిన సూర్య.. జూలై 2024లో కెప్టెన్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. కెప్టెన్‌గా ఆయన యావరేజ్ సీదా 25.88 కి పడిపోగా.. కేవలం 6 హాఫ్ సెంచరీలు, 4 సార్లు డకౌట్లు అయ్యాడు.
ముగిసిన మిస్టర్ 360 ఎరా..
జనవరి 2025 నుంచి మార్చి 2026 వరకు ఆడిన 35 మ్యాచ్‌ల్లో కేవలం 26 సగటుతో 702 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్‌పై హాఫ్ సెండరీ కొట్టాక.. మళ్లీ జనవరి 2026 లో న్యూజిలాండ్ సిరీస్ వరకు మనోడి బ్యాట్ నుంచి పెద్ద స్కోరు రాలేదు. మొన్నటి వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై 84 రన్స్ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించినా, ఆ తర్వాత మళ్లీ పాత కథే రిపీట్ అయింది.
►ALSO READ | కేఎల్ రాహుల్ ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. DRS తీసుకోకుండా మోసపోయిన ఆఫ్ఘన్ టీమ్
రికార్డులు కిర్రాక్..
నిజానికి నంబర్ 3, నంబర్ 4 పొజిషన్లలో మిస్టర్ 360 షాట్లతో టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించిన కిర్రాక్ రికార్డు సూర్య సొంతం.. తన కెరీర్లో ఆడిన 113 టీ20ల్లో 162.94 స్ట్రైక్ రేట్‌తో 3,272 రన్స్ చేసిన అతడు.. సారథిగా ఎంపికైన తర్వాత భారత్ 2025 ఆసియా కప్, 2026 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలని గెలుచుకుంది. అంతకుముందు ప్లేయర్‌గా 2023 ఆసియా కప్, 2024 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్స్ లోనూ ఉన్నాడు. కెప్టెన్సీ రికార్డులు అదిరిపోయినా.. కేవలం రీసెంట్ ఫామ్ దెబ్బతినడం, ఫ్యూచర్ ప్లాన్స్ వల్లే సూర్య ఎరా ఇలా ముగిసిపోయింది.
Ajit Agarkar :Regards Shreyas we have seen what he have done leading different teams in Ipl,won once, finals once probably had a tougher season this year after consecutive wins.
— Shikha (@Shikha_003) June 6, 2026
Moreover he said Shreyas is well deserving Captain 🥺♥️ pic.twitter.com/oCaSDdDq2K
