దీదీ కోసం దాదా రంగంలోకి దిగారా.. యూసుఫ్ పఠాన్ను దిగిపొమ్మన్నారా..? బెంగాల్లో కొత్త వివాదం

దీదీ కోసం దాదా రంగంలోకి దిగారా.. యూసుఫ్ పఠాన్ను దిగిపొమ్మన్నారా..? బెంగాల్లో కొత్త వివాదం

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం.. బీజేపీ అధికారంలోకి రావటం.. ఆ తర్వాత రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. ఏదో ఒక వివాదంతో బెంగాల్ లో నిత్యం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లేటెస్టుగా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ కేంద్రంగా మరో వివాదం మొదలైంది. 

బెంగాల్ ఎన్నికల తర్వాత మాజీ సీఎం మమతా బెనర్జీ సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉప ఎన్నిక ద్వారా దీదీ పార్లమెంటుకు వెళ్తుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలో మమత బెనర్జీ కోసం గంగూలీ రంగంలోకి దిగారనీ.. బహరంపూర్ ఎంపీ స్థానానికి రిజైన్ చేయాల్సిందిగా యూసుఫ్ పఠాన్ ను కోరినట్లు బెంగాల్ లో ఒక దినపత్రిక రాసుకొచ్చింది. 

ఈ వార్త బెంగాల్ వ్యాప్తంగా పెద్ద డిబేట్ కు కారణమైంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకునే గంగూలీ.. మమతా బెనర్జీ కోసం పనిచేశారని.. పార్టీకి అనుసంధానంగా పనిచేశారని కామెంట్స్ వచ్చాయి. ఈ వ్యవహారం విపరీత ప్రచారంలోకి రావడంతో గంగూలీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. సంచలనాల కోసం.. బాధ్యతారాహిత్యంగా.. నిజమేంటనే నిర్ధారణ లేకుండా ఇలాంటి కథనాలు రాయటం సరికాదని గంగూలీ ఫైరయ్యారు.

  • ఏంటి దీదీ–దాదా–పఠాన్ వివాదం:

ముర్షీదాబాద్ జిల్లాలోని బహరంపూర్ నియోజకవర్గంపై టీఎంసీ కన్నేసినట్లు కథనంలో పేర్కొంది. అక్కడ 2024లో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదురీపై మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ గెలిచారు. అయితే అక్కడ ముస్లీం పాపులేషన్ 50–52 శాతం ఉండటంతో.. మమతకు అది సేఫ్ బెట్ గా పార్టీ భావించిందట. 

►ALSO READ | ఐదేళ్ల కన్న బిడ్డను అలా ఎలా చంపేశావమ్మా.. బెంగళూరులో దారుణ ఘటన

 అయితే బహ్రాన్ పూర్ సీట్ నుంచి తప్పుకోవాల్సిందిగా.. పఠాన్ ను ఒప్పించాలని గంగూలీని కోరిందట పార్టీ . పఠాన్ రాజీనామా చేస్తే.. అక్కడి నుంచి దీదీ పార్లమెంటుకు వెళ్తుందని.. గంగూలీ మధ్యవర్తిత్వం చేయగా.. అందుకు పఠాన్ తిరస్కరించినట్లు కథనంలో పేర్కొంది. 

బెంగాల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై.. దీదీ భవిష్యత్తుపై రాసిన ఆర్టికల్ లో సదరు దినపత్రిక.. గంగూలీ రాయబారం నడిపారు అన్నట్లుగా రాసుకొచ్చింది. మమత లోక్ సభకు వెళ్లాలంటే యూసుఫ్​ పఠాన్ రాజీనామా చేయాలని.. అందుకోసం గంగూలీ మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేసినట్లు ఆ కథనంలో ఉంది. 

ఈ వ్యవహారం బెంగాల్ లో తీవ్ర దుమారం రేపుతుండటంతో.. గంగూలీ శనివారం (జూన్ 06) క్లియర్ కట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అది పూర్తిగా తప్పుడు వార్తగా కొట్టిపారేశారు. మీడియా సంస్థలు నిజనిర్ధారణ చేసుకుని వార్తా కథనాలు రాయాల్సిందిగా కోరారు.