ఐపీఎల్ 2023లో కొత్త రూల్స్.. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాతే తుది జట్టు నిర్ణయం

ఐపీఎల్ 2023లో కొత్త రూల్స్.. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాతే తుది జట్టు నిర్ణయం

ఈసారి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ కండీషన్స్‌‌‌‌‌‌‌‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత తుది జట్టును ఎంచుకునే కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ను అమల్లోకి తీసుకురానుంది. గతంలో టాస్‌‌‌‌‌‌‌‌కు ముందే ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు క్లాజ్‌‌‌‌‌‌‌‌ 1.2.1 ప్రకారం ఈ రూల్‌‌‌‌‌‌‌‌ను మార్చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత రిఫరీకి సమర్పించే  11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. దీనివల్ల టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌ను, ఓడితే మరో టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే వెసులుబాటు లభించింది.

దీనివల్ల బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో గణనీయమైన ప్రభావం కనిపించనుంది. ఈ నయా రూల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టారు. ఇక బౌలర్‌‌‌‌‌‌‌‌ నిర్దిష్ట టైమ్‌‌‌‌‌‌‌‌లో తన ఓవర్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయకపోతే ఓవర్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించనున్నారు. ఈ పెనాల్టీ వల్ల 30 యార్డ్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ వెలుపలా నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. అలాగే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి ఫీల్డర్‌‌‌‌‌‌‌‌, వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ అనవసరంగా తమ పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ మార్చుకుంటే ఆ బంతిని డెడ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించి ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధిస్తారు.