Tilak Varma: తిలక్ వర్మ గాయంపై బీసీసీఐ అప్‌డేట్.. తెలుగు కుర్రాడు వరల్డ్ కప్ ఆడతాడా..?

Tilak Varma: తిలక్ వర్మ గాయంపై బీసీసీఐ అప్‌డేట్.. తెలుగు కుర్రాడు వరల్డ్ కప్ ఆడతాడా..?

వరల్డ్ కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ ఆటగాడు తిలక్ వర్మ వరల్డ్ కప్ ఆడడం దాదాపు ఖాయంగా మారింది. రిపోర్ట్స్ ప్రకారం తిలక్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు సమాచారం. గజ్జల్లో గాయం కారణంగా ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు ఈ తెలుగు కుర్రాడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు టీ20 మ్యాచ్ లకు తిలక్ అందుబాటులో లేడు. అయితే ఈ సిరీస్ లో జరగబోయే చివరి మ్యాచ్ కు తిలక్ వర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ ముందు తిలక్ ను ఆడించి రిస్క్ చేసే ఉద్దేశ్యంలో బీసీసీఐ లేనట్టు తెలుస్తుంది.  

వరల్డ్ కప్ సమయానికి తిలక్ వర్మను తాజాగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం న్యూజిలాండ్ తో జరగబోయే చివరి రెండు మ్యాచ్ లకు తిలక్ ఫిట్ గా ఉన్నప్పటికీ రెస్ట్ ఇవ్వనున్నారు. శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు టీ20 మ్యాచ్ లకు కూడా జట్టుతోనే ఉండనున్నాడు. వరల్డ్ కప్ సమయానికి తిలక్ ను ఫ్రెష్ గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. లేటెస్ట్ గా తిలక్ వర్మ గాయం గురించి బీసీసీఐ అధికారి అప్ డేట్ ఇచ్చారు.

" ప్రస్తుతం తిలక్ వర్మకు ఎలాంటి నొప్పి లేదు. గాయం నుంచి త్వరగా మెరుగవుతున్నాడు. ప్రపంచ కప్‌కు అందుబాటులో ఉండాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తి నమ్మకంతో ఉంది. న్యూజిలాండ్ తో జరగబోయే నాలుగో టీ20కోసం అందుబాటులో ఉంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. తిలక్ చివరి మ్యాచ్ సమయానికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు". అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే వరల్డ్ కప్ ముందు తిలక్ ను ఆడించి రిస్క్ చేసే ఉద్దేశ్యంలో బీసీసీఐ లేనట్టు తెలుస్తుంది. 

 ALSO READ : విజయ్ అమృత్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ కు పద్మభూషణ్.. రోహిత్‌‌‌‌‌‌‌‌, హర్మన్‌‌‌‌‌‌‌‌ ప్రీత్‌‌‌‌‌‌‌‌కు పద్మశ్రీ
  
విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ గాయపడిన తిలక్:
 
తిలక్ వర్మ బుధవారం (జనవరి 7) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్ కోట్ తో మ్యాచ్ ఆడుతుండగా గజ్జల్లో గాయమైంది. గాయామ్ నుంచి కోలుకోవడానికి ఈ తెలుగు కుర్రాడికి మూడు వారాల సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మూడు టీ20 మ్యాచ్ లకు దూరమయ్యాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేశారు. అయ్యర్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేనందున ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఒకవేళ తిలక్ జట్టులోకి వస్తే శ్రేయాస్ అయ్యర్ ను స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయనున్నారు.