World Test Championship 2027: ఇండియాలోనే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్..? ఆందోళనలో ఐసీసీ

World Test Championship 2027: ఇండియాలోనే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్..? ఆందోళనలో ఐసీసీ

టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైన దగ్గర నుంచి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోనే జరుగుతుంది. రెండు సార్లు ఇంగ్లాండ్ లోనే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నిర్వహించగా.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కు లార్డ్స్‌ వేదిక కానుంది. దీంతో వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది.  జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3న ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. అయితే ఈ సారి టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ వేదిక మారే అవకాశం ఉంది. 

బీసీసీఐ 2027లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఇండియాలో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. 2027 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను భారత్ వేదిక కావాలనే కోరికను బీసీసీఐ వ్యక్తం చేసింది. గత నెలలో జింబాబ్వేలో జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సమావేశంలో 2027 డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహించాలనే ఉద్దేశ్యాన్ని ఐసీసీకి బీసీసీఐ సమర్పించింది. అయితే ఇక మాత్రమే ఈ ప్రపోజల్ పట్ల ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. భారత జట్టు 2027లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోతే ఇండియాలో టిక్కెట్ల అమ్మకాలు భారీగా దెబ్బతింటాయి.

►ALSO READ | Ambati Rayudu: నువ్వు తప్పుకుంటే టెస్ట్ క్రికెట్ బతకదు.. కోహ్లీ రిటైర్మెంట్‌పై రాయుడు ఎమోషనల్ పోస్ట్

ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో భాగాంగా  ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్నాయి.  జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3 న ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు.

వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాపై ఇదే తొలిసారి.