IPL 2025 final: ఐపీఎల్ ఫైనల్లో ఆపరేషన్ సిందూర్ సెలెబ్రేషన్స్.. త్రివిధ దళాధిపతులకు బీసీసీఐ ఆహ్వానం

IPL 2025 final: ఐపీఎల్ ఫైనల్లో ఆపరేషన్ సిందూర్ సెలెబ్రేషన్స్.. త్రివిధ దళాధిపతులకు బీసీసీఐ ఆహ్వానం

ఆపరేషన్ సిందూర్ సమయంలో వీరోచితంగా పోరాడిన భారత సాయుధ దళాలకు బీసీసీఐ ప్రత్యేక నివాళులు ఇవ్వనుంది. జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ ఫైనల్‌కు భారత సాయుధ దళాల ముగ్గురు సర్వీసుల అధిపతులను ఆహ్వానించినట్లు బీసీసీఐ మంగళవారం (మే 27, 2025) తెలిపింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా, అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నావల్ చీఫ్‌గా ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా ఉన్నారు.

ఇటీవలే ఆపరేషన్ సిందూర్ సమయంలో వారి "వీరోచిత ప్రయత్నాలకు" నివాళిగా ఈ కార్యక్రమం ముగింపు వేడుక కూడా ఉండబోతుంది. "ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం పురస్కరించుకొని అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ ఫైనల్‌కు భారత సాయుధ దళాల అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులు, సైనికులందరికీ మేము ఆహ్వానం పంపాము" అని బీసీసీఐ సెక్రటరీ సైకియా తెలిపారు. దేశ సాయుధ దళాల "ధైర్యం, నిస్వార్థ సేవ"కు BCCI సెల్యూట్ చేస్తుందని శ్రీ సైకియా అన్నారు. 

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడితో ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం బైసారన్ పర్యాటక ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన టూరిస్టులను కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా దాడి తరవాత పౌరులపై జరిగిన అతిపెద్ద టెర్రరిస్టు అటాక్ ఇదే. ఈ టెర్రర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితో దేశం నలుమూలలనుంచి వివిధ  రాష్ట్రాలకు చెందిన పర్యాటకులున్నన్నారు.

►ALSO READ | LSG vs RCB: లక్నోతో RCB కీలక పోరు.. మ్యాచ్ రద్దయితే పంజాబ్‌తో క్వాలిఫయర్ 1 ఆడేది ఆ జట్టే!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 విషయానికి వస్తే మంగళవారం (మే 27) లీగ్ మ్యాచ్ లు ముగియనున్నాయి. మే 29 న క్వాలిఫయర్ 1.. మే 30 ఎలిమినేటర్.. జూన్ 1 న క్వాలిఫయర్ 1.. జూన్ 3 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4 లో నిలిచి ప్లేయర్ ఆఫ్స్ కు అర్హత సాధించాయి.