
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతూ బిజీగా ఉంది. ఈ లీగ్ ముగిసిన తర్వాత వెంటనే వెస్టిండీస్ తో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఒకవేళ ఇండియా ఆసియా కప్ ఫైనల్ కు వస్తే మూడు రోజుల్లోనే ఈ టెస్ట్ సిరీస్ జరగనుంది. మరో 10 రోజుల్లో జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. వెస్టిండీస్ తో సిరీస్ టెస్ట్ సిరీస్ కోసం భారత స్క్వాడ్ ను సెప్టెంబర్ 23 లేదా 24న జరుగుతుందని దేవజిత్ సైకియా తెలియజేశారు.
సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక సమావేశం ఆన్‌లైన్‌లో ఉంటుంది". అని సైకియా బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో అన్నారు. వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో టీమిండియాకు స్వదేశంలో తొలి సిరీస్. మే నెలలో రోహిత్ శర్మ నుంచి జట్టు పగ్గాలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్.. జూలై నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాడు.
ఇదిలా ఉండగా.. భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధం కావడానికి విండీస్ జట్టుకు సెప్టెంబర్ 24-29 మధ్య అహ్మదాబాద్‌లో 6 రోజుల శిబిరాన్ని నిర్వహిస్తారు. మరోవైపు ఇండియా జట్టు 2025 ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఒక రోజు వ్యవధిలోనే సెప్టెంబర్ 29న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది.
అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
టీమిండియాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు వెస్టిండీస్ జట్టు:
రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చంద్రపాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ మరియు జేడెన్ సీల్స్.