IPL New Rules: ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్ గా పేరొందిన ఐపీఎల్‌లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతుల్యతను మళ్లీ తీసుకురావడానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఇటీవల జరిగిన ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డుల కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఐపీఎల్ నిబంధనలు పూర్తిగా బ్యాటర్లకే లాభం చేకూరుస్తున్నాయి, బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను రద్దు వద్దు:
మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రకటించే ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్ లో ఒకరిని.. లైవ్ మ్యాచ్‌లో ప్లేయింగ్ XI లోని ఆటగాడితో మార్చుకునే సదుపాయాన్ని 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ కల్పిస్తుంది. దీనివల్ల జట్లకు బ్యాటింగ్ డేప్త్ పెరిగి, వికెట్లు పడుతున్నా భయం లేకుండా హిట్టింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో 220+కి పైగా స్కోర్లు సర్వసాధారణం అయిపోవడానికి ఈ రూలే కారణం.. అందుకే ఈ వివాదాస్పద నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని సచిన్ గట్టిగా డిమాండ్ చేశారు.
సచిన్ సరికొత్త బౌలింగ్ ఐడియాలు:
బౌలర్లకు కాస్త వెసులుబాటు కల్పించడానికి సచిన్ రెండు కీలక మార్పులను సూచించారు.
* పవర్‌ప్లే స్పిల్ట్: ఇన్నింగ్స్ ప్రారంభంలో మొదటి 4 ఓవర్లను బ్యాటింగ్ పవర్‌ప్లేగా ఉంచి.. మిగిలిన 2 ఓవర్ల పవర్‌ప్లేను మ్యాచ్ మధ్యలో ఫీల్డింగ్ కెప్టెన్ తనకు నచ్చినప్పుడు (ఫీల్డింగ్ పవర్‌ప్లేగా) ఉపయోగించుకునేలా ఛాన్స్ ఇవ్వాలి.
ALSO READ : బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచిన ఆర్సీబీ..
* ఒక బౌలర్‌కు 5 ఓవర్లు: ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక బౌలర్ గరిష్టంగా 4 ఓవర్లు మాత్రమే వేయగలడు.. కానీ, జట్టులోని బెస్ట్ బౌలర్‌కు 5 ఓవర్లు వేసే ఛాన్స్ ఇస్తే.. బౌలింగ్ టీమ్‌కు మంచి పట్టు దొరుకుతుందని సచిన్ అభిప్రాయపడ్డారు.
బీసీసీఐ ఏమంటోంది?:
ఈ అంశంపై ఓ బీసీసీఐ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మాజీ క్రికెటర్లు, నిపుణుల నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు పలు మార్పులపై అనేక సూచనలు వస్తున్నాయి. వాటన్నింటినీ మేము స్వీకరిస్తున్నాం.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, అపెక్స్ కౌన్సిల్ అంతర్గత సమావేశాల్లో వీటిపై సమగ్రంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా సచిన్ కంటే ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్లేయర్స్, విశ్లేషకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. రాబోయే సీజన్లలో బీసీసీఐ ఈ రూల్‌ను పక్కనబెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Sachin Tendulkar’s suggestions to restore balance in T20 cricket and IPL (ESPNcricinfo)
— Cricketopia (@CricketopiaCom) May 31, 2026
1. Scrap the Impact Player rule.
2. Allow one bowler per team to bowl up to five overs instead of the current four-over limit.
3. Introduce dual Powerplays:
a) A four-over batting… pic.twitter.com/bT17lJGXwu
