
ముంబై : వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో ఓడిపోయి స్వదేశానికి బయలుదేరనున్న టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే టూర్‌లో ఇండియా, వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ టూర్‌కు విరాట్‌కోహ్లీ, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారని సమాచారం. వీరితోపాటు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చే చాన్స్ ఉంది. విండీస్ పర్యటనకు వెళ్లే జట్టు ఎంపిక కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జులై 17 లేదా 18 తేదీన సమావేశం కానుంది. మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా క్రికెట్‌ఆడుతున్న ధోనీకి ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న ధోనీ చేతి వేలికి సెమీస్‌లో గాయమైందన్నారు. ధోనీకి విశ్రాంతినిస్తే ఆ ప్లేస్‌లో రిషబ్ పంత్ విండీస్ వెళతాడని, కోహ్లీ, బుమ్రాకు వన్డేలు, టీ20లకు రెస్ట్ ఇస్తామని, టెస్ట్‌లకు వారి అందుబాటుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గాయాలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా, భువీపై కూడా చర్చ జరుగుతుందన్నారు. భువీకి ప్రత్యామ్నాయంగా ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చహర్ ఉన్నారని చెప్పారు. కోహ్లీకి పూర్తిగా విశ్రాంతినిస్తే వన్డే, టీ20 జట్లకు రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, టెస్ట్ జట్టును అజింక్యా రహానె నడిపిస్తాడని తెలియజేశారు.
టీమ్‌గా రాణించలేకపోయాం: రోహిత్
అవసరమైన సమయంలో జట్టుగా రాణించకపోవడం వల్లే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో తాము ఓడిపోయామని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయప్డడాడు. ‘అవసరమైనప్పుడు మేం జట్టుగా రాణించలేకపోయాం. 30 నిమిషాల చెత్త ఆట వరల్డ్‌కప్‌ను మా నుంచి దూరం చేసింది.ఈ ఓటమి బాధతో నా గుండె బరువెక్కింది. మీ (అభిమానుల) పరిస్థితి కూడా అలానే ఉందనుకుంటున్నా. టోర్నీ అసాంతం స్వదేశం నుంచి మాకు లభించిన సపోర్ట్ అద్భుతం. ఇంగ్లండ్‌లో మేం ఆడిన ప్రతి చోటును నీలి రంగులోకి మార్చిన మీకందరికీ థ్యాంక్స్’ అని రోహిత్ ట్వీట్ చేశాడు.