
పాము అంటే ఎవరికైనా భయమే. చిన్న పిల్లల్లో అయితే ఆ భయం ఇంకాస్తా ఎక్కువే ఉంటుంది. పాము పిల్లను చూస్తేనే ఆమడ దూరం పరిగెడుతుంటాం. కొందరు పిల్లలైతే కప్ప గెంతినా భయపడుతుంటారు. అలాంటిది.. ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఈ పిల్లలు ఏకంగా ఒక పేద్ద కొండచిలువనే పట్టుకున్నారు. చేతిలో ఏదో చాంతాడు ఉన్నట్టు.. ఆ భారీ పామును 3 కిలోమీటర్లు ఊరేగింపుగా మోసుకెళ్లారు. 15 అడుగుల ఆ కొండచిలువను ఉత్త చేతులతో ఊరేగించి.. సెల్ఫీలు తీసుకుని.. వీడియోలు తీసుకుని ఈ గ్రామస్తులు, పిల్లలు చేసిన పని తెలిసి అటవీ శాఖ అధికారులే అవాక్కయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని జహంగీర్ బాద్ కొత్వాలీ ప్రాంతంలోని డూంగ్రా జాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఈ గ్రామంలోని జనావాసాల్లోకి ఉన్నట్టుండి ఒక 15 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. ఆ కొండ చిలువను చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి అక్కడున్న పిల్లలే ఉత్త చేతులతో ఆ కొండ చిలువను పట్టుకుని.. మూడు కిలోమీటర్లు ఊరేగించి అడవిలో ఆ కొండ చిలువను వదిలేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘అది కొండచిలువ అనుకున్నారా..? కొత్తిమీర కట్టనుకున్నారా..? మీ ధైర్యం తగలెయ్య..!’’ అని ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేశారు.
ఇండోనేషియాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎనిమిది మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును మింగేసింది. ఆ రైతు మృతదేహాన్ని బయటకు తీయడం కోసం గ్రామస్తులు ఆ పైతాన్ పొట్ట చీల్చారు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో.. అతని కోసం వెతుకులాట సాగించగా ఒక భారీ పైతాన్ కనిపించింది. ఆ పైతాన్ కడుపులో ఒక మనిషిని మింగినట్లు ఆకారం కనిపించింది. దీంతో.. గ్రామస్తులు ఆ పైతాన్ను చంపేసి పొట్ట కోసి చూడగా సదరు రైతు మృతదేహం కనిపించింది.
In Bulandshahr, Uttar Pradesh, children caught a 15-foot python and treated it like a toy. They carried it for three kilometers, taking selfies and making reels. Later, they safely released the python into the jungle.
— durgeshkdubey (@ToolsTech4All) July 7, 2025
उत्तर प्रदेश के बुलंदशहर में बच्चों ने 15 फीट के अजगर को… pic.twitter.com/mt92SF6wkr