లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ ధైర్యానికి మైండ్ బ్లోయింగ్ : 18 అడుగుల కోబ్రాను చేతులతో ఇట్టే పట్టేసింది..!

లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ ధైర్యానికి మైండ్ బ్లోయింగ్ : 18 అడుగుల కోబ్రాను చేతులతో ఇట్టే పట్టేసింది..!

పాము అంటేనే  భయపడతాం..కాదు కాదు ఆ పేరు విన్నా చూసినా.. వెంటనే కిలో మీటర్ల దూరం  పారిపోతాం. కొందరు మహిళలైతే చిన్న బొద్దింకను చూసినా భయపడి పోతారు.  కానీ ఓ మహిళా ఆఫీసర్  ఏకంగా 18 అడుగుల కింగ్ కోబ్రాను ఎలాంటి భయం,జంకూ లేకుండా చేతితో  పట్టుకున్నారు. ఆమె ఘట్స్ కు  హ్యాట్సాప్ చెప్పాల్సిందే.  కేరళలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కేరళలోని తిరువనంతపురంలోని పెప్పర ప్రాంతంలోని అంచుమారుతుమూట్ సమీపంలోని నీటి ప్రవాహంలో  స్థానికులు కింగ్ కోబ్రాను చూశారు.  భయపడ్డ స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు.  విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్ట్ కు చెందిన మహిళా ఆఫీసర్ రోషిణి ఘటనా స్థలానికి వచ్చారు.

ఎలాంటి భయం లేకుండా  ఆమె నీళ్లలో ఉన్న ఆ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించగా..అది బుసలు కొట్టింది. అయినా ఏమాత్రం జంకకుండా  ఓ చేతితో కర్ర, మరో చేతితో ప్లాస్టిక్ బ్యాగ్  పట్టుకుని  కోబ్రాను నెమ్మదిగా కొన్ని నిమిషాల్లోనే  నీళ్ల నుంచి బయటకు తీసి తోకను ఓ చేతితో  పట్టుకుని బ్యాగులో బంధించారు. మహిళా ఆఫీసర్ ధైర్యాన్ని చూసిన వాళ్లు నోరెళ్ల బెట్టారు. ఆమెను ప్రశంసలంతో ముంచెత్తారు.

►ALSO READ | వర్షం బీభత్సం: 78 మంది మృతి.. రోడ్లు బ్లాక్, రెడ్ అలెర్ట్ జారీ..

ఈ తతాంగం అంతా అక్కడున్న మరొకరు వీడియో తీయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఆ మహిళా అధికారిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాప్ రోషిణి మేడమ్, రోషిణి మేడమ్ మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎలుకలను పట్టినట్టు కింగ్ కోబ్రాను అంత సింపుల్ గా బంధించారేంటి అంటున్నారు.  

జిఎస్ రోష్ని ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో 800 కి పైగా పాములను పట్టుకున్నారంట. గతంలో  ఆమె విషపూరితమైన , విషం లేని పాములను పట్టుకున్నారు. అయితే ఇలాంటి  భారీ కింగ్ కోబ్రాను పట్టుకోవడం  ఇదే మొదటి సారని చెప్పారు.