
వర్షాకాలం వచ్చిందంటే వరదలు, కాలువలు పొంది పొర్లుతాయి. కానీ ఉత్తరం వైపు కొండచరియలు విరిగిపడటం, ఇల్లులు భవనాలు నీటిలో మునిగిపోవడం, ఎంతో మంది కొట్టుకుపోవడం జరుగుతుంటుంది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు భీభత్సం సృష్టించాయి. దింతో 78 మంది మరణించగ, చాలా మంది గాయపడ్డారు అలాగే కొందరు కనిపించకుండా పోయారు. గత నెల జూన్ 20 నుండి ఉహించని వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. దింతో ఇళ్ళులు, మౌలిక సదుపాయాలు, స్థానిక బ్యాంకు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లోని నాలుగు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ : జూలై 6 నాటికి హిమాచల్ ప్రదేశ్‌లో 23 ఆకస్మిక వరదలు, 19 మేఘాల విస్ఫోటనాలు, 16 చోట్ల కొండచరియలు విరిగిపడటం జరిగాయి. 78 మరణాలలో 50 మరణాలు వర్షం కారణంగా, వాటిలో మృతులు వరదల్లో మునిగిపోవడం, కరెంట్ షాక్, పిడుగులు, ఊహించని వరదలు ఉన్నాయి. దీనికి తోడు 28 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) సుమారు 37 మంది ఇంకా కనిపించకుండా పోయారని, 115 మంది గాయపడ్డారని తెలిపింది.
వరదలకి ఎక్కువగా దెబ్బతిన్న ప్రాంతాలలో మండి ఒకటి, ఇక్కడ హిమాచల్ కోఆపరేటివ్ బ్యాంకు మొదటి అంతస్తు నీరు ఇంకా శిథిలాలలో మునిగిపోయింది. సమాచారం ప్రకారం, కోట్ల విలువైన వస్తువులు, పత్రాలు ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. వరదల్లో కొట్టుకొచ్చిన వస్తువులను దోచుకోవడానికి ప్రజలు ప్రయత్నించడంతో ఈ ప్రాంతంలో దొంగతనాలు కూడా పెరిగాయని చెబుతున్నారు.
మరోవైపు మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి, 243 రోడ్లు మూతపడ్డాయి. 278 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం లేదు, అలాగే 261 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. భారత వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు, తుఫానులు కురుస్తాయని అంచనా వేసింది. అయితే సిర్మౌర్, కాంగ్రా, మండిలలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది.
🌧️ The spell of heavy monsoon rain continues in Himachal Pradesh.
— All India Radio News (@airnewsalerts) July 6, 2025
In the last 24 hrs, Aghar (Hamirpur) recorded the highest rainfall at 110 mm.
Cloudbursts in Mandi and Chamba have disrupted normal life.
⚠️ IMD issues warning for heavy rain & flash floods in 10 districts over… pic.twitter.com/rqA9NaBPio
భారీ వర్షాల హెచ్చరిక: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, ఉత్తరకాశి, రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఉఖిమత్, ఘన్సాలి, నరేంద్ర నగర్, చిన్యాలిసౌర్‌తో సహా కొన్ని ప్రాంతాలలో జూలై 7 నుండి 8 తేదీలలో అధిక ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది.
రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ అధికారులు, పోలీసులు ఇంకా విపత్తు బృందాలను హై అలర్ట్‌లో ఉండి, పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది. హిమాలయ ప్రాంతాలలో పర్యాటకులు ఇంకా వాహనాల రాకపోకలను కఠినంగా నియంత్రించింది. రాబోయే 48 గంటలు ఫోన్లు, పరికరాలు యాక్టివ్‌గా పెట్టుకోవాలని, వారికి కేటాయించిన ప్రాంతాలలోనే ఉండాలని అధికారులందరికీ చెప్పారు.