ఐపీఎల్-2020 నిర‌వ‌ధిక వాయిదా

ఐపీఎల్-2020 నిర‌వ‌ధిక వాయిదా

ఐపీఎల్ -2020పై స‌స్పెన్స్ వీడింది. అక్టోబ‌ర్ లో ఐపీఎల్ ఉంటుందా.. లేదా అనేదానిపై ఓ నిర్ణ‌యం తీసుకుంది బీసీసీఐ. అంతా అనుకున్న‌ట్లే ఐపీఎల్-2020ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది బీసీసీఐ. ఈ విష‌యాన్ని బుధ‌వారం అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది బీసీసీఐ. క‌రోనా వైర‌స్ త‌గ్గ‌క‌పోవ‌డం, లాక్ డౌన్ పొడిగించిన క్ర‌మంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల‌తో మాట్లాడిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ.