బీసీసీఐ టార్గెట్‌ రూ. 300 కోట్లు

బీసీసీఐ టార్గెట్‌ రూ. 300 కోట్లు

న్యూఢిల్లీ: రాబోయే ఏడు రోజుల్లో ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కింద రూ. 300 కోట్లు సంపాదించాలని బీసీసీఐ టార్ట్‌గె గా పెట్టుకుం ది. ఇందుకోసం బోర్డు కొత్త ప్లాన్‌ను సిద్ధం చేసింది. టైటిల్‌ స్పాన్సర్ ‌షిప్‌ ద్వారా రూ. 225 నుంచి 250 కోట్లు, మిగిలిపోయిన రెండు, మూడు పార్ట్‌‌నర్‌‌‌ షిప్‌ స్లాట్స్‌ ద్వారా రూ. 60 నుంచి 70 కోట్లు రాబట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌, ఎఫ్‌బీబీ, డ్రీమ్ 11 ఐపీఎల్‌ అఫీషియల్‌ పార్ట్‌‌నర్ట్‌‌ ర్స్‌గా ఉన్నా.. ఈ కేటగిరీలో మరో మూడు స్లాట్స్‌ అందుబాటులో
ఉన్నాయి. ఈ మూడు స్లాట్స్‌ను కూడా కంపెనీలకు కేటాయించాలని గతేడాది నవంబర్ 5న జరిగిన గవర్నింగ్ ‌‌కౌన్సిల్ ‌మీటింగ్‌‌లో నిర్ణ‌యంచారు. కానీ కరోనా కారణంగా ఎవరూ రాలేదు. దీంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త ప్లాన్‌ను తెరమీదకు తెచ్చింది. ఈ మూడు ఖాళీలను పూరించేందుకు పొటెన్షియ‌ల్‌ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.

ఎడ్యూ టెక్‌ కంపెనీ అయిన అన్ అకాడమీ, క్రెడ్ , కోక్‌, లీడింగ్ ‌‌టూ వీలర్‌ కంపెనీలు ఈ స్లాట్స్‌పై ఇంట్రెస్ట్ ‌‌చూపిస్తున్నాయి. ఇప్పటికే అన్ అకాడమీ టైటిల్ స్పాన్సర్షిప్ ‌కోసం టెండర్ ‌డాక్యుమెంట్లను కూడా తీసుకుంది. గతేడాది రూ. 618 కోట్లు వాస్తవానికి గత ఐపీఎల్‌ ద్వారా బీసీసీఐ రూ. 618 కోట్లు సంపాదించింది. టైటిల్‌ స్పాన్సర్ వివో రూ. 440 కోట్లు ఇవ్వగా, అఫీషియల్‌ పార్ట్‌‌నర్స్ ‌‌ అయిన టాటా మోటార్స్‌, ఎఫ్‌బీబీ, డ్రీమ్ ‌11.. రూ. 120 కోట్లు చెల్లించాయి. అంపైర్‌స్పాన్సర్‌ అయిన పేటీఎమ్‌రూ. 28 కోట్లు, స్ట్రాటజిక్‌ టైమ్‌ అవుట్‌ పార్ట్‌‌నర్‌ ‌‌ అయిన సీయెట్‌ రూ. 30 కోట్లు ఇచ్చాయి. అయితే రాబోయే ఏడు రోజుల్లో బీసీసీఐ రూ. 300 కోట్లు సంపాదించినా.. మరో రూ. 140 కోట్లు షార్ట్‌‌గా‌‌ ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. 300 కోట్లు రెవెన్యూ వచ్చినా బోర్డు గట్టెక్కినట్లే.