BCCI విరాళంగా 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

BCCI విరాళంగా 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా సోకిన బాధితులు ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పేషెంట్లు సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో బాగంగానే తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI). కొవిడ్ పై పోరులో భాగంగా 10 లీటర్ల సామర్థ్యం గల 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించాలని నిర్ణయించింది. రాబోయే నెలల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దేశవ్యాప్తంగా అందజేయాలని BCCI భావిస్తోంది.

కరోనా మహమ్మారిపై వైద్య ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా పోరాడుతోందన్నారు బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ప్రజలను కాపాడడంతో వారు నిజమైన ఫ్రంట్ లైన్ యోధులన్నారు. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఈ కిష్ల పరిస్థితిలో ఎంతో ఉపయోగపడనున్నట్లు తెలిపారు.