న్యూఢిల్లీ: ఫిజీ, మాల్దీవుల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి బీసీసీఐ ముందుకు వచ్చింది. గురువారం ఆన్‌లైన్ విధానంలో జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
క్రికెట్‌లో ఎదుగుతున్న చిన్న దేశాలకు అండగా నిలవాలనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆశయానికి బలాన్నిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచడానికి భారత్ తరఫున కోచ్‌లను పంపించడంతో పాటు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించనుంది.
