కామర్స్ వైపు స్టూడెంట్ల చూపు.. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్​మెంట్​లో బీకాందే హవా

కామర్స్ వైపు స్టూడెంట్ల చూపు.. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్​మెంట్​లో బీకాందే హవా
  • దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్​మెంట్​లో బీకాందే హవా 
  • మూడోవంతు ఆప్షన్లు ఆ సీట్ల కోసమే
  • జాబ్ ఆఫర్లు ఎక్కువగా ఉండటంతోనే మొగ్గు
  • కామర్స్ వైపు స్టూడెంట్ల చూపు

రాష్ట్రంలో డిగ్రీలో కామర్స్​ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా రెట్టింపు అవుతున్నది. డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ఫస్ట్ ఫేజ్ లో అలాట్​అయిన సీట్లే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దోస్త్ ఫస్ట్ ఫేజ్​లో సీట్లు పొందిన వారిలో 33,251(45.41%) మంది అభ్యర్థులు కామర్స్ గ్రూపునే ఎంచుకున్నారు. వెబ్ ఆప్షన్లలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సుకు ఎక్కువ మంది ఆప్షన్ ఇచ్చారు. మొత్తం 78,212 మంది 3,43,102 ఆప్షన్లు ఇవ్వగా.. వారిలో 1,04,687 మంది బీకాం (సీఏ)కోర్సుకు ఆప్షన్ ఇచ్చారు. 

మరో12,651 మంది బీకాం జనరల్​కు ఇచ్చారు. ఈ లెక్కన బీకాం కంప్యూటర్ కోర్సుకు స్టూడెంట్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు స్పష్టమవుతున్నది. మరోపక్క బీకాం కోర్సులో సీట్లు పొందిన వారిలో 97 శాతానికి పైగా ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్లు ఉన్నారు. 32,556 మంది ఇంగ్లిష్ మీడియం, 667 మంది తెలుగు మీడియం, హిందీ మీడియంలో ముగ్గురు, ఉర్దూ మీడియంలో 22 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు కాలేజీల్లో కామర్స్ కు ఒక గ్రూపు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం కామర్స్ కోసం ప్రత్యేకంగా కాలేజీలే వెలిశాయి. స్టేట్​లో 40–-50 వరకు కామర్స్ కాలేజీలు ఏర్పడటం దాని ప్రాధాన్యతను తెలియజేస్తున్నది. 

కామర్స్​తో ఫుల్ జాబ్స్..

స్టేట్​లో డిగ్రీ కామర్స్ కోర్సుల్లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్చారు. బిజినెస్, ఫారెన్ ట్రెండ్స్, జీఎస్టీ, సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఉండేలా కరికులమ్  చేంజ్ చేశారు. ఈ క్రమంలో బీకాం చేసిన తర్వాత సీఏ, సీఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే మంచి ఫ్యూచర్ లభించే అవకాశం ఉంది. స్కిల్ సెక్టార్​ కోర్సుగా బీకాం కంప్యూటర్స్​ మారిపోయింది. ప్రస్తుతం ప్రతి సంస్థ, కంపెనీ అకౌంట్స్ చూసేందుకు కామర్స్ చదివిన వారిని తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నది. ప్రైవేటు సంస్థల్లోనూ మంచి జాబ్స్ లభిస్తుండటంతో ఎక్కువ మంది ఈ కోర్సు చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక.. సంస్థలు కామర్స్ చదివిన వారి సేవలనే వినియోగించుకుంటున్నాయి. ఇటీవల స్కిల్ ఇండియా రిపోర్టు కూడా ఇదే విషయాన్ని బహిర్గతం చేసింది. ఉద్యోగాలతో పాటు మంచి ప్యాకేజీలూ కామర్స్ చదివిన వారికి వచ్చే అవకాశముందని రిపోర్టులో పేర్కొన్నది. బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా కామర్స్ అభ్యర్థులకే ప్రయార్టీ ఇస్తున్నారు. 

మంచి ఫ్యూచర్ ఉండటంతోనే..

బీకాం కోర్సులకు మంచి ఫ్యూచర్ ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు బీకాం కంప్యూటర్స్​ కోర్సుల వైపు వస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్​తో పాటు ప్రైవేటు జాబ్​ ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేటు బ్యాంకులు కామర్స్ చదివిన వారినే తీసుకుంటున్నాయి. ఫ్లిప్​కార్ట్, అమెజాన్, జొమాటో లాంటి అనేక సంస్థలు  ఆఫర్సు ఇస్తున్నాయి.  

- ప్రొఫెసర్ వీ.అప్పారావు, ఓయూ బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ కామర్స్ చైర్మన్ఎంప్లాయ్​మెంట్ 

పెరగడమే కారణం 

కామర్స్ కోర్సుల కరికులమ్ అందరికీ ఉపయోగపడేలా మార్చాం. దీంతో ఈ కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలతో పాటు బిజినెస్ కూడా చేసుకునే చాన్స్​ఉంది. దీంతో ఎక్కువ మంది కామర్స్ వైపు ఆకర్షితులవు తున్నారు. జీఎస్టీ విధానం వచ్చాక కామర్స్ స్టూడెంట్లకు ఆఫర్లు పెరిగాయి. 
- ప్రొఫెసర్ లింబాద్రి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్