బీసీ సమస్యపై ... సుప్రీం చీఫ్ పై ... ఎంత చర్చ జరుగుతోంది?

బీసీ సమస్యపై ... సుప్రీం చీఫ్ పై ... ఎంత చర్చ జరుగుతోంది?

బీసీ రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలు, ఇవి దేశవ్యాప్తంగా కోట్లమంది జీవితాలకు సంబంధించినవైనా వీటిని సాధారణంగా క్లిష్టమైన, దీర్ఘకాలిక సమస్యలుగా భావిస్తున్నారు.  ఈ అంశాలపై మాట్లాడటం రాజకీయంగా సున్నితమైన విషయమని దాటవేస్తున్నారు. 

ఇది కుట్ర కోణం.  ఎవరు ఏమి చెబితేనూ అది కుల పార్టీ ఆధారంగా అర్థం చేసుకుంటారనేది ఒక సాకు మాత్రమే. అందుకే పౌర సమాజం, ముఖ్యంగా మధ్యతరగతి వర్గం, ఈ సమస్యలపై మౌనం వహించడం చూస్తున్నాం.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్​పైన షూ విసరడం డ్రామాటిక్. దృష్టిని ఆకర్షించే సంఘటన. మీడియా, సోషల్ మీడియాకు ఇది ‘న్యూస్ వర్ధీ’ విషయం. ఇది సులభంగా ‘విలన్–విక్టిమ్’ కథలా చెప్పగల సంఘటన. అందుకే ప్రజలు, మీడియా, విశ్లేషకులు దీనిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. 

పైగా ఇందులో  ‘హిందూత్వ’, ‘సుప్రీంకోర్టు’, ‘ప్రతిష్ఠ’ వంటి పెద్ద పదాలు రావడం వలన చర్చ మరింత వేడెక్కుతుంది.  బీసీ సమస్య  లోతైన సామాజిక వాస్తవం, దీని పరిష్కారం కష్టమైనది, అందుకే దానిపై తక్కువ చర్చ. షూ విసరడం క్షణిక, సెన్సేషనల్ సంఘటన, అందుకే దానిపై ఎక్కువ చర్చ. ఈ సంఘటనను  వ్యతిరేకించాలి, ఖండించాలి.
 
- పాపని నాగరాజు-