
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ఎల్బీ నగర్లో శనివారం బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాజకీయాల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను రాజకీయంగా సంఘటితం చేస్తామని అన్నారు. అన్ని పార్టీలూ బీసీలను మోసం చేస్తున్నాయని ఓ ప్రకటనలో ఆయన ఫైరయ్యారు. వృత్తులు వేరైనా బీసీలంతా ఒక్కటేనన్న నినాదంతో రాజకీయ ప్లీనరీని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్లీనరీలోనే బీసీల రాజకీయ పాలసీని ప్రకటిస్తామన్నారు.