జడ్జి పరీక్షల్లో బీసీలకు అన్యాయం జరిగింది: ఆర్​ కృష్ణయ్య

జడ్జి పరీక్షల్లో బీసీలకు అన్యాయం జరిగింది: ఆర్​ కృష్ణయ్య
  • జూనియర్ సివిల్ జడ్జి, జిల్లా జడ్జి .. పరీక్షల్లో బీసీలకు అన్యాయం

  • రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆర్​ కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు:  జూనియర్ సివిల్ జడ్జి, జిల్లా జడ్జి పరీక్ష  రాసె బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య  అన్నారు. తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ  సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆర్​ కృష్ణయ్య మాట్లాడుతూ...    జూనియర్ సివిల్ జడ్జి, డిస్టిక్ జడ్జి పరీక్ష ప్రస్తుత నోటిఫికేషన్ లో ఓబీసీ  అభ్యర్థులకు రాత పరీక్ష,  వైవా-  కనీస కట్ ఆఫ్ మార్కుల రిలాక్సేషన్  లేదని అన్నారు.  వాటిని సవరించి సామాజిక న్యాయం  చేయాలని డిమాండ్​ చేశారు.   ఆంధ్రప్రదేశ్ , ఇతర రాష్ట్రాల్లో ఓబీసీలకు రిలాక్సేషన్ ఉందని  గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, రఘునాథ్, రమేశ్, భాస్కర్, గుజ్జ కృష్ణ  
 పాల్గొన్నారు.