
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్‌లో ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ సెల్ టవర్‌ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదర్‌నగర్‌లోని ఆర్అండ్ఎల్ ఇంజినీరింగ్కంపెనీలో రాము(35) సివిల్ కాంట్రాక్ట్‌పనులు చేస్తున్నాడు. పెండింగ్బిల్లులు రూ.8 లక్షలను కంపెనీ అతనికి చెల్లించడం లేదు.
ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం పట్టించుకోకపోవటంతో బుధవారం మధ్యాహ్నం రాము బాటిల్లో పెట్రోల్పోసుకొని, సెల్ టవర్ ఎక్కాడు. తన డబ్బులు ఇవ్వకపోతే కాల్చుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, అతనికి నచ్చజెప్పారు. కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి, బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడంతో రాము కిందికి వచ్చాడు.