
న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి సుమారు రూ. 2,903 కోట్ల విలువైన ఆర్డర్ (అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్) ను టీసీఎస్ దక్కించుకుంది. ఇందులో భాగంగా 18,685 4జీ నెట్‌వర్క్ సైట్లను ఏర్పాటు చేయడం, ఇంజనీరింగ్ సర్వీస్‌లను అందించడం, టెస్టింగ్, మెయింటెనెన్స్ వంటివి ఈ ఐటీ కంపెనీ చేపడుతుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్రాజెక్ట్ కోసం టీసీఎస్, మరో టాటా గ్రూప్ కంపెనీ తేజస్ నెట్‌వర్క్స్ మధ్య కూడా ఒప్పందం కుదిరింది. రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఆర్‌ఏఎన్), ఇతర ఎక్విప్‌మెంట్ సప్లయ్‌ల విలువ సుమారు రూ.1,525.53 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డీల్‌కు సంబంధించి డిటైయిల్డ్ పర్చేజ్ ఆర్డర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో టీసీఎస్‌కు ఇష్యూ చేస్తుంది.