పూజా ఖేడ్కర్కు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీం

పూజా ఖేడ్కర్కు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: చీటింగ్, ఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను దుర్వినియోగం చేశారంటూ ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌‌ పిటిషన్‌‌ విచారణ సందర్భంగా జస్టిస్‌‌ బీవీ నాగరత్న, జస్టిస్‌‌ సతీష్ చంద్రశర్మతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆమె చేసిన తీవ్రమైన నేరం ఏంటని పోలీసులను ప్రశ్నించింది. దర్యాప్తునకు సహకరించాలని ఆమెకు ఆదేశించింది. ‘‘ఆమె ఏం నేరం చేసింది? ఆమె డ్రగ్ లార్డ్ కాదు, టెర్రరిస్టు కాదు. ఎటువంటి హత్యా చేయలేదు. ఎన్ డీపీఎస్ కింద ఖేడ్కర్ పై కేసు నమోదు కాలేదు. కేసు వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిటిషనర్‌‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుచేసి ఉండాల్సింది. ఈ కేసుపై దర్యాప్తును త్వరగా పూర్తిచేయండి. దర్యాప్తునకు సహకరించేలా ఆమెను ఆదేశిస్తాం’’ అని పేర్కొంది.