
హైదరాబాద్: భాగ్యనగరంలో వాతావరణం చల్లపడింది. హైదరాబాద్ సిటీని కారు మేఘాలు కమ్మేశాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. శంషాబాద్, ఆరంఘర్, చాంద్రాయణ గుట్ట, పహాడీ షరీఫ్, అత్తాపూర్, టోలీచౌకీ, రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, షేక్ పేట్, లంగర్ హౌజ్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, బీహెచ్ఈఎల్, మదీనాగూడ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలను సాయంత్రం 4 గంటల తర్వాత మేఘాలు కమ్మేస్తాయని, ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
HyderabadRains WARNING 2 ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) May 21, 2025
The next round of SEVERE STORMS formed across Shamshabad, Aramghar, Chandrayanagutta, Pahadi Sharif to cover Attapur, Rajendranagar, Tolichowki, Shaikpet, Mehdipatnam, Langerhouse, Narsingi, Bandlaguda Jagir, Gachibowli, Nanakramguda,…
గచ్చిబౌలిలో ఇప్పటికే వర్షం మొదలైంది. బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుంది. కొండాపూర్లో కూడా వర్షం పడుతోంది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి, అబిడ్స్, రామాంతపూర్, అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. రానున్న మూడు రోజులు పాటు హైదరాబాద్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం కూడా వర్షాలు పడతాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ALSO READ | అరేబియన్ సముద్రంలో వాయుగుండం : తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు
ఈ ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు పడతాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పలు జిల్లాలో కురిసే అవకాశం ఉంది. ఈరోజు పశ్చిమ, తూర్పు జిలాలకు భారీ వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.