
న్యూఢిల్లీ: హర్యానా యంగ్ షూటర్ కనక్.. జర్మనీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. బుధవారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 17 ఏళ్ల కనక్ 239.0 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఎనిమిది మంది బరిలోకి దిగిన మెడల్ ఫైట్‌లో అన్నా డుల్సీ (మాల్డోవా) 1.7 పాయింట్ల తేడాతో సిల్వర్‌ను సొంతం చేసుకుంది. చెన్ యెన్ చాంగ్ (చైనీస్ తైపీ)కి బ్రాంజ్ మెడల్ లభించింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో కనక్ అద్భుతమైన గురితో ఆకట్టుకుంది. మ్యాచ్ చివరి రౌండ్స్‌లో తన అనుభవాన్ని ఉపయోగించి ఎక్కువగా 10/10 పాయింట్లు రాబట్టి ఈజీగా మెడల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌లో ప్రాచీ, కనక్ వరుసగా 571, 572 పాయింట్లు సాధించారు. అయితే ఫైనల్ ఆరంభంలో ప్రాచీ టాప్–3లో నిలిచినా క్రమంగా వెనకబడింది.