ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలి: డీజీ నాగిరెడ్డి

ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలి: డీజీ నాగిరెడ్డి

అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ
అగ్ని ప్రమాదాల నివారణే ర్యాలీ ఉద్దేశం: ఫైర్ డీజీ నాగిరెడ్డి

అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైటెక్స్ నుంచి సికింద్రాబాద్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ మేరకు ఫైర్ డీజీ నాగిరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హైటెక్స్ నుంచి కూకట్ పల్లి వై జంక్షన్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్పేట్, బేగంపేట్, పారడైజ్ ప్రాంతాల మీదగా సికింద్రాబాద్ చేరుకున్నారు. అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ర్యాలీ ముఖ్య ఉద్దేశమని నాగిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

ప్రమాదాల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని డీజీ నాగిరెడ్డి చెప్పారు. బహుళ అంతస్తుల భవనాల యాజమాన్యాలు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు.. మంటలు విస్తరించే ప్రమాదం ఉండడంతో సకాలంలో మంటలను గుర్తించి ఆర్పేందుకు ప్రయత్నం చేయాలని తెలిపారు.