వంద శాతం సబ్సిడీతో ట్రాన్స్ జెండర్లకు రుణాలు

వంద శాతం సబ్సిడీతో ట్రాన్స్ జెండర్లకు రుణాలు
  • దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రాన్స్​జెండర్లకు 2025–-26 ఆర్థిక సంవత్సరానికి రూ.75 వేల వరకు వందశాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సాధికారిత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్  రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 55 ఏండ్ల వయస్సు, ఏదైనా శిక్షణ పొంది చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునే ట్రాన్స్​జెండర్లు అవసరమైన ధ్రువపత్రాలతో నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని  ఆఫీసులో వచ్చేనెల 31లోపు అందజేయాలన్నారు. 

ఇతర సమాచారం కోసం 9640452773 నంబర్​ను సంప్రదించాలన్నారు. ఈ పథకం కింద హైదరాబాద్ జిల్లాకు మొత్తం 30 స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించినట్లు, 30 మంది అర్హులైన ట్రాన్స్​జెండర్ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరన్నారు. అందిన దరఖాస్తుల్లో అర్హులైన అభ్యర్థులను జిల్లా స్థాయి కమిటీ  పరిశీలించి ఆమోదిస్తుందన్నారు. దరఖాస్తు పత్రాన్ని www.wdsc.telangana.gov.in వెబ్‌‌సైట్ నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని,  లేదా నేరుగా ఆఫీసులో అందజేయవచ్చన్నారు.